పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ

parama jeevamu naakunivva - thirigi leechenu naathoonunda

🎵 TG-1130🌐 Telugu
పల్లవి

పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును ||యేసు చాలును చాలును - యేసు చాలును చాలును|| ||ఏ సమయమైన - ఏ స్థితి కైన - నాజీవితములో యేసు చాలును||

1వ చరణం

సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను ||పరమ జీవము||

2వ చరణం

పచ్చిక బయలలో పరుండచేయున్‌ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్‌ - మరణ లోయలో నను కాపాడును ||పరమ జీవము||

3వ చరణం

నరులెల్లరు నను విడిచినను - శరీరము క్రుళ్ళి కృషించినను హరించినన్‌ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను ||పరమ జీవము||

Report Error