♪♫
TG-5411
Telugu
పరమ కుమ్మరి నేను మంటిపాత్రను
Parama Kummari Neenu Mantipaathranu
0
views
పల్లవి
పరమ కుమ్మరి నేను మంటిపాత్రను నీదు సారూప్యములో నన్ను మలచుము (2) అను పల్లవి : నీ చిత్తమే సిద్దించుగాక నీదు సంకల్పముల్ నెరవేర్చుమా విరిగి నలిగినా మంటి పాత్రయే నీకు ఇష్టమైన బలియాగము విరిగి నలిగిన మంటి పాత్రను విడనాడలేవనే ఈ ప్రార్థన ||పరమ||
1వ చరణం
1. స్వ బుద్ధిని ఆధారము చేసికొని ఎన్నడూ నష్టపడకుండను కాపాడుమా (2) అనుమతి చిత్తమును ఎన్నడూ చేయక సంపూర్ణ చిత్తమునే చేయనేర్పుమా (2) ||నీ చిత్తమే||
2వ చరణం
2. తీర్పు దినమందున అగ్ని పరీక్షలో నాదు ప్రతిపని నిలుచునట్లుగా (2) ప్రతి విషయమందునా నీ చిత్తము చేయుట నాకు నేర్పించుమా సర్వభౌముడా (2) ||నీ చిత్తమే||