TG-5418
Telugu

పరమ పావనుడు మరియ తనయుడు

Parama Paavanudu Mariya Thanayudu

19
views
పల్లవి

పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2) మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ||

1వ చరణం

1.  దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2) వినరండి బాల యేసుని దివ్యగాథను కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ||

2వ చరణం

2.  తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2) అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ||పరమ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.