♪♫
TG-5417
Telugu
పరమ పవిత్ర స్వర్గపిత జై ప్రభు జై ప్రభు
Parama Pavithra Svargapitha Jai Prabhu Jai Prabhu
0
views
పల్లవి
పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వ సదా యుగయుగములకు - రక్షకుడా - మమ్ములను రక్షించితివి జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు 1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున 2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి పాపము తీసితివి - నీ కౄప ఉన్నతము 3. శత్రు సైతానున్ - ఓడించితివీవు నీ మరణము వలన - విమోచించితివి 4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివి శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి 5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు 6. ప్రవాహములోన - ప్రభు నేనుండినను నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్ 7. జై జై యని పాడుడి - యేసునకే మహిమ జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా