TG-5421
Telugu

పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు

Parama Raajyamunaku Narulu Thirigi Puttavalayu

0
views
పల్లవి

పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ||

1వ చరణం

1.  వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ||

2వ చరణం

2.  అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||

3వ చరణం

3.  బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ||

4వ చరణం

4.  మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ||

5వ చరణం

5.  అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ||

6వ చరణం

6.  క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ||

7వ చరణం

7.  వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ||

8వ చరణం

8.  అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||