యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు
yeesu raajugaa vachchu chunnaadu - bhuulooka manthaa thelusukontaaru
యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకు పోతాడు లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం || యేసు||
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఈ సువార్త మూయబడున్ - వాక్యమే కరువగును || యేసు||
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును - ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును ||యేసు రాజుగా||
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును || యేసు||
క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి సిద్ధముగానుండు రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి || యేసు||