TG-1193
Telugu

యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి

yeesee naa pari haari - priya yeesee naa parihaari

186
views
పల్లవి

యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి

1వ చరణం

ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి ||యేసే నా||

2వ చరణం

నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి ||యేసే నా||

3వ చరణం

మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి ||యేసే నా||

4వ చరణం

బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి ||యేసే నా||

5వ చరణం

దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను ||యేసే నా||