యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు

yeesu andariki prabhuvu.... yeesee.... lookarakssakudu

🎵 TG-1191🌐 Telugu
పల్లవి

యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే ||యేసు||

1వ చరణం

అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే ||యేసు||

2వ చరణం

దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె ||యేసు||

3వ చరణం

పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి ||యేసు||

4వ చరణం

రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె ||యేసు అందరికి||

Report Error