TG-1189
Telugu

యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు

yeesunu sthuthiyinchu vaaru nithyajeevamu nondedaru

204
views
పల్లవి

యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు

1వ చరణం

వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా || యేసు ||

2వ చరణం

చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా ||యేసు ||

3వ చరణం

నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ ||యేసు ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.