పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు గాను స్మరణఁ జేతుము ||పరమ తండ్రి||
నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము హర్స రవముతోఁ ||పరమ తండ్రి||
అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ తండ్రి||
వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను సేవ జేయుట ||పరమ తండ్రి||
ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ తండ్రి||
మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ తండ్రి||
గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ తండ్రి||
శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ తండ్రి||
దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ తండ్రి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.