TG-5415
Telugu

పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై

Parama Thandri Suthudu Praanamichchenee Paapi Korakai

0
views
పల్లవి

పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై 1.  వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా 2.  కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్ 3.  దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్ 4.  మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే 5.  యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్