TG-5423
Telugu

పరమ వైధ్యుడా మా యెహోవా రాఫా

Parama Vaidhyudaa Maa Yehoovaa Raaphaa

23
views
పల్లవి

పరమ వైధ్యుడా మా యెహోవా రాఫా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా పరమవైధ్యుడా మా ప్రభు యేసు దేవా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా వందనమర్పింతుమయ్యా పరమవైధ్యుడా వందనమర్పింతుమయ్యా మా ప్రభుయేసు దేవా 1.  నీవు పొందినా గాయములచే మాకు స్వస్థతనిచ్చితివి (2) నీ పంచ గాయములే మాకు వైద్యాలయం (2) ||వందనమర్పింతుమయ్యా||

1వ చరణం

2.  నీవు కార్చిన శుద్ధ రక్తమే మా దోషములకు దివ్యౌషధం (2) ప్రభు యేసు నామములో మాకు స్వస్థత (2) ||వందనమర్పింతుమయ్యా||

2వ చరణం

3.  నీ శక్తిగల వాక్కులతో బాగుచేయుదువు కృంగియున్న వారిని ఆదరింతువు (2) నీకసాధ్యమేలేదు విశ్వసించెదం (2) ||వందనమర్పింతుమయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.