పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో
parama yerussaleemaa - parishuddha bhuussannaalathoo
పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ
నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి - అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని ||పరమ||
రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడ పిలచిన కోడిపోలి పిలిచాడు ప్రభు నిన్ను వెనుదియ్యకు ప్రభునుండి ||పరమ||
తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా మరువవచ్చును ప్రభు నిన్ను మరువడు మరువవద్దు ప్రభు యేసుని ||పరమ||
శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో - శోధనలలో విశ్వాసం కాపాడుకో - ప్రభుకొరకు సిద్ధపడుమా గొర్రెపిల్ల జీవకన్యకా ||పరమ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.