♪♫
TG-5455
Telugu
పరిపూర్ణంబగు గురువు యెవరు?
Paripoornanbagu Guruvu Yevaru?
22
views
పల్లవి
పరిపూర్ణంబగు గురువు యెవరు? ప్రేమతో నిండిన హృదయుండె 1. పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే 2. ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు కపటము డాగులేని సుబుద్ధి - కరుణమయ హృదయుడు 3. కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్ 4. సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.