పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా
parishuddha parishuddha = parishuddha prabhuvaa
పల్లవి
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా || పరిశుద్ధ ||
1వ చరణం
పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ = నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా || పరిశుద్ధ ||
2వ చరణం
పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ = నరులను రక్షించు = కరుణా నముద్రా || పరిశుద్ధ ||
3వ చరణం
పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ = పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా || పరిశుద్ధ ||
4వ చరణం
జనకకుమారాత్మ = లను నేక దేవ = ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా || పరిశుద్ధ ||