పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు
Parishuddha Shree Yeesuvee Paralookaraaju
పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజు మురియుచు నే పూజింతును - నిరతము అను పల్లవి: పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు 1. పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు పెనుగునందున యాకోబు - వినయమున నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె 2. ఈ దినమున నుండి - పదిలముగ ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్ కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు 3. సీయోనులోనుండి - ప్రియుడైన యేసు కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్ పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండున్ 4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల రాయినొసంగి వాని భయము తొలగించు జయము 5. నడిపించుచుండి నిత్యము - తన దృష్టి నిలిపి విడువకుండగ నీ ప్రభు - కడవరకు ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో 6. బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు సిలువలో నీకై సమసెను - సీయోను గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.