TG-244
Telugu

పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ

parishuddhaathmumda deeva! prabhuvaa nee

198
views
పల్లవి

పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు మయ్య ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

1వ చరణం

బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన తుల్ సల్పుదు మయ్య ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

2వ చరణం

బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ బల వాక్య మిడు మాకుఁ ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

3వ చరణం

విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని యవనిం బ్రతుక నిమ్ము ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

4వ చరణం

పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్ త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ భయమొంద నీయకుము ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

5వ చరణం

మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము మము ప్రభువా ||పరిశుద్ధాత్ముఁడ దేవ!||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.