TG-268
Telugu

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై

parishuddhaathmumda, lemmu nee sanghamupai

202
views
పల్లవి

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా టిరి నీదు సత్యంబు ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

1వ చరణం

బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్ నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు చుందురు ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

2వ చరణం

ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ గుము ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

3వ చరణం

పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ బంపుము దేవ ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

4వ చరణం

నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ దయచేసి నీ యొద్దఁ ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

5వ చరణం

జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ మొందు నీ వాక్కు ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

6వ చరణం

ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన సంఘాధ్యక్షుండ ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

7వ చరణం

నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా ||పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.