పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన

parishuddham parishuddham parishuddham bayina

🎵 TG-505💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా పరమ కానానున కరుగున దెపుడో ||పరిశుద్ధం పరిశుద్ధం||

1వ చరణం

పరిశుద్ధమయిన యా యెరుషలేము పురము వర పద్మరాగంపు స్ధిర పునాదులతోడ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నురురత్న ద్వారంబు లదిరిగ గల వహహ ||పరిశుద్ధం పరిశుద్ధం||

2వ చరణం

ఆ నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశి కానఁ బడఁ బోవు దేదీప్య మానంబై విలసిల్లు మానిత గొఱ్ఱియ దానికి జ్యోతియై తనరుచుండు నహహ ||పరిశుద్ధం పరిశుద్ధం||

3వ చరణం

శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాఁటు శ్రేష్ట సమయంబున మంగళ ప్రదమైన మహిమ రాజ్యమునందు రంగైన ప్రభుయేసు రాజున్ దర్శింతును ||పరిశుద్ధం పరిశుద్ధం||

4వ చరణం

తళతళ మెఱసెడు ధవళంపు టంగీలు కళ లీనుచుండంగ గాళ్లార ధరియించి భళిర భళిర యంచు భక్తాళితో నెపుడు నెళవుగా నుందుము నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం పరిశుద్ధం||

5వ చరణం

భూరి వీణెలు చేతఁ బొల్పుగ ధరియించి సారెకు మీటుచు సంగీత ములు బాడి శ్రీ రాజా నీకు జో హారంచు ప్రభు యేసు పేరఁ గీర్తింతురు ప్రియ భక్తులందఱు ||పరిశుద్ధం పరిశుద్ధం||

6వ చరణం

కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీటమును జుట్టి తిరుగు దూతలఁగూడి పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ సంగీతంబు బాడుచుండెద నాహా ||పరిశుద్ధం పరిశుద్ధం||

Report Error