పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో
Parishuddhamee Yeesuni Rakthan Pravahinchenu Kalvariloo
పరిశుద్ధమే యేసుని రక్తం – ప్రవహించెను కల్వరిలో కడుగబడుము పావన రక్తం – ప్రభుయేసునే ఆరాధించు సూరూపమైనను సొగసైననులేదు – తృణీకరింపబడెను విసర్జించిరి మనుజులెల్లరును – దైవమే చేయి వీడెను పదివేలలోన అతిసుందరుండు – రూపునే కోల్పోయెను వ్యసనాక్రాంతుడుగా వ్యాధిగ్రస్థునిగా – కనిపించే నా ప్రియుడు మనము చూడనొల్లని స్వరూపుడాయె – మనమెన్నిక చేయలేదు పదివేలలోన అతి శ్రేష్ఠనీయుడు – హీనునిగా చేయబడెను మన రోగములను భరియించె ప్రభువే – నిశ్చయముగా ఆ సిల్వపై మన వ్యసనములన్ని వహియించినతడే – దేవుని వధ గొర్రెపిల్లయి పదివేలలోన అతిపరిశుద్ధున్డు – పాపముగా చేయబడెను మన దోషములకై గాయములనొంది – స్వస్థతనిచ్చే ప్రియుడై మన సమాధానార్థమైన శిక్ష భరియించె – నలుగగొట్టబడెను పదివేలలోన అతిమహాఘనుడు – రక్తపుముద్దాయెను బాధింపబడిన మౌనియైయుండెను – నోరుతెరువడాయెను అన్యాయపుతీర్పు నొందినవాడై – బలియాయేనాసిల్వలో పదివేలలోన అతికాంక్షణీయుడు – ద్వేషింపబడికూలెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.