పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు
parishuddhudavu paramandu shreeshthudavu
పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు ఆరాధ్యుడవు అతి సుందరుడవు (2)
యేసయ్యా నీ రక్తధారలు (2) శుద్ధి చేసెనయ్యా నా పాప డాగులు యేసయ్యా... నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవు||
పాపము మానలేని కన్నులు గలవాడను మోహపుచూపులతో మదమెక్కిన వాడను (2) నీ జ్ఞానమూ నేను త్రోసివేయుచున్ననూ (2) జీవముతో నింపితివి జయోత్సాహమిచ్చితివి (2) ||యేసయ్యా నీ||
తాపకరమైన నాగుల విషమును చిందిస్తూ మాటలతో గాయపరచువాడను (2) నీ మాటను నేను లెక్క చేయకున్ననూ (2) మేలులెన్నో చేసితివి మర్యాదను నేర్పితివి (2) ||యేసయ్యా నీ||
గర్వముతో నిండిన హృదయపు గిన్నెను పగతీర్చుకొనుటలో ప్రావీణ్యుడను (2) నీ ప్రేమను నేను తూలనాడుచున్ననూ (2) పరిశుద్ధత నిచ్చితివి పరలోకం చేర్చితివి (2) ||యేసయ్యా నీ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
