TG-2665
Telugu

పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన

parugeththedaa parugeththedaa pilupuku thagina

52
views
పల్లవి

పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||

1వ చరణం

దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2) అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా