పసి బాలుడై ప్రేమా రూపుడై

pasi baaludai preemaa ruupudai

🎵 TG-2247🌐 Telugu
పల్లవి

పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు రండి రండి నేడు బెత్లహేము పురముకు రండి రండి ఆ యేసు రాజునొద్దకు రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు ||పసి బాలుడై||

1వ చరణం

యేసు రాజు పుట్టేనని హల్లేలూయా గంతులు వేసి పాడుదమా హల్లేలూయా నిజ రక్షకుడు అని హల్లేలూయా ఆరాధించెదము హల్లేలూయా ||రండి||

2వ చరణం

ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా రాజులకు రాజు హల్లేలూయా ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా

Report Error