పేద నరుని రూపము
Pedha Naruni Roopamu
పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని||
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||
తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని||
ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2) నీ వ్యాధిని వేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే (2) ||పేద నరుని||
మాయ లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనస్సు మారిపోవునిల (2) నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని||
తామసించెదవేల ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2) ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||