TG-3387
Telugu

పిలచిన వాడవు నా ప్రియ హితుడవు

pilachina vaadavu naa priya hitudavu

Eli Mosesఎలిమోసెస్ · EliMosesఎలిమోసెస్ · EliMoses
1
views
Chorus

పిలచిన వాడవు నా ప్రియ హితుడవు నా ప్రియుడా నా యేసయ్యా (2) ఓటమిలో నను నడిపించే ధైర్యము నీవే ఓరిమితో నను గెలిపించే సాయుథ నీవే ఎంచుటకు యోగ్యత లేని నను పిలిచావే

పల్లవి పూర్వ భాగం

నాలోన నీవే వుండి నడిపించావే నాలోనా నే లేనే నీలాగే మారాలి నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2)

మధ్య విరామం

ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు llపిలచిన వాడవుll

1వ చరణం

ఈ జీవము నీదేనని తెలుసు కున్నానుగా ధర మరువ లేని ఆ త్యాగము నీవు చేసావుగా నే తీర్చ లేను నీ ఋణమును చాలించక నీలో ఈ తనువును ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక llనాలోనాll

2వ చరణం

వెతికాయి నా కనులు నిజమైన ప్రేమకై స్వార్థమే లోకమంతా నిజమైన ఆ ప్రేమ కదిలించే నీ వాక్కై ఆత్మలో నీదు చెంతా ఆ ప్రేమను నే మరతునా నీ ఋణం తీరదు ఏమిచ్చినా ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక llనాలోనాll

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.