TG-538
Telugu

పిల్ల నైన నన్నుఁ జూడుమీ

pilla naina nannum juudumee

189
views
పల్లవి

పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్నుఁ జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ ||పిల్ల నైన||

1వ చరణం

నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||

2వ చరణం

ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||పిల్ల నైన||

3వ చరణం

పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ ||పిల్ల నైన||

4వ చరణం

బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ ||పిల్ల నైన||