♪♫
TG-4095
Telugu
పూజనీయుడేసు ప్రభ
Poojaneeyudesu Prabhu
0
views
పల్లవి
పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||
1వ చరణం
నీ స్వకీయులే నిందించినా నిన్నంగీకరించక పోయినా (2) ఎన్నో బాధ లొందితివా నాకై (2) సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||
2వ చరణం
సత్యము మార్గము మరి జీవమై నిత్యజీవమియ్యను వచ్చితివి (2) వంచకుడవని నిన్ను నిందించిరా (2) ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు||
3వ చరణం
యూదా గోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా (2) అధములు నిను సమరయుడనిరా (2) నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు||
4వ చరణం
మధురం నీ నామం అతి మధురం మధుర గీతముతో నిన్నారాధింతును (2) వధియించబడితివా యీ పాపికై (2) వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||