పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు
poopoovee yoo lookamaa chaalimkamjaalu
పల్లవి
పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే యో||
1వ చరణం
సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద భక్తి మా కెబ్బఁ ||పోపోవే యో||
2వ చరణం
నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై ననుఁబిల్చెఁ ||పోపోవే యో||
3వ చరణం
ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలుఁ ||పోపోవే యో||
4వ చరణం
ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ||పోపోవే యో||