పోరాటం ఆత్మీయ పోరాటం

pooraatam aathmeeya pooraatam

🎵 TG-1279🌐 Telugu
పల్లవి

పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగి పోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి

1వ చరణం

నా యేసుతో కలసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయనే నా యేసు కొరకు సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

2వ చరణం

నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

3వ చరణం

ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమందు ఆ సింహాసనం నా గమ్యస్థానం ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||

Report Error