పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది
porli porli paaruthoondi karunnaanadi - kalvariloo yeesu svaami rudhiramadi
🎵 TG-1137🌐 Telugu
పల్లవి
పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది ||4|| 1 నిండియున్న పాపమంత కడిగివేయును ||3|| రండి మునుగడిందు పాపశుద్ధి చేయును (2) చేయును శుద్ధి (4) 2 రక్తము చిందించకుండా పాపము పోదు ||3|| ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు (2) గలదు జీవము (4) 3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే ||3|| కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము (2) రక్తము యేసు (4) 4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము ||3|| రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము (2) మోక్షం ఉచితం (4)