TG-4096
Telugu

పొర్లి పొర్లి పారుతుంది

Porli Porli Paaruthundi

22
views
పల్లవి

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4) నిండియున్న పాపమంత కడిగివేయును కడిగివేయును.. కడిగివేయును (2) రండి మునుగుడిందు పాపశుద్ధి చేయును (2) చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||

1వ చరణం

రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు.. పాపము పోదు (2) ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు (2) గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి||

2వ చరణం

విశ్వ పాపములను మోసే యాగ పశువదే యాగ పశువదే.. యాగ పశువదే (2) కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము (2) రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి||

3వ చరణం

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2) రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము (2) మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.