TG-4097
Telugu

ప్రాణమా నా ప్రాణమా

Praanamaa Naa Praanamaa

0
views
పల్లవి

ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను సన్నుతించుమా ప్రియ యెహోవా చేసిన మేలులను నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా||

1వ చరణం

గత కాలములన్నిటిలో కృపతోనే నడిపించెను (2) కరుణ కటాక్షమనే (2) కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా||

2వ చరణం

నిను విడువక ఎడబాయక నిత్యం నీకు తోడైయుండెను (2) నీవు నడిచిన మార్గములో (2) నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా||

3వ చరణం

పాప శాపము వ్యాధులను పారద్రోలియే దీవించెను (2) పరిశుద్ధుడు పరమ తండ్రి (2) బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా||

4వ చరణం

మహా ఆనంద మానందమే మహారాజా నీ సన్నిధిలో (2) మహిమగల మహారాజా (2) మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||