TG-3024
Telugu

ప్రాణము కంటే మిన్నగా నన్ను ప్రేమించావయ్య

praanamu kantee minnagaa nannu preeminchaavayya

Avinash Anselబ్రో.గుణవీర్ పాల్ · Bro.Gunaveer Paulజోసెలైన్ · Joselyn
12
views
Chorus

ప్రాణము కంటే మిన్నగా నన్ను ప్రేమించావయ్య ఎవ్వరు చూపని ప్రేమ నాపై చూపావేసయ్య నీ ప్రేమకు ప్రతిగా జీవితమంతా స్తుతియిస్తానయ్య నా విరిగిన హృదయం కానుకగా నీ కర్పిస్తానయ్య.

పల్లవి పూర్వ భాగం

యేసయ్య ఆ..... నీవే ఆధారం యేసయ్య ఆ.. నీవే ఆశ్రయం (2) ||ప్రాణము కంటే||

1వ చరణం

అన్ని ఉంటే నా వెంట వచ్చే లోక ప్రేమ కాదు కష్టాలు ఉంటే చేయి విడిచే మనుషుల ప్రేమ కాదు (2) ఆహ! నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ (2) శాశ్వత ప్రేమది - నను ఎన్నడు వీడనిది (2) ||యేసయ్య||

2వ చరణం

రూపము చూచే నన్ను మెచ్చే లోక ప్రేమ కాదు అంతస్ధుల బట్టి గౌరవించే మనుషుల ప్రేమ కాదు (2) ఆహ! నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ (2) మారని ప్రేమది స్థిరమైన ప్రేమది (2) ||యేసయ్య||

3వ చరణం

కులమును బట్టి విలువను ఇచ్చే లోక ప్రేమ కాదు. మతమును బట్టి బేధము చూపే మనుషుల ప్రేమ కాదు (2) ఆహ! నీకై, నాకై ప్రాణము మిచ్చిన క్రీస్తు ప్రేమ (2) కల్వరి ప్రేమది నన్నాకర్షించినది (2) ||యేసయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.