ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
praanneeshvara – prabhu daivakumaara
🎵 TG-1931🌐 Telugu
పల్లవి
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర||
1వ చరణం
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2) నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర||
2వ చరణం
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||