TG-4100
Telugu

ప్రార్ధన కలిగిన జీవితం

Praardhana Kaligina Jeevitham

22
views
పల్లవి

ప్రార్ధన కలిగిన జీవితం పరిమళించును ప్రకాశించును పై నుండి శక్తిని పొందుకొనును (2) విడువక ప్రార్ధించిన శోధన జయింతుము విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన||

1వ చరణం

విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||

2వ చరణం

విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.