TG-2240
Telugu

ప్రార్ధన యేసుని సందర్శన పరమ

praardhana yeesuni sandarshana parama

83
views
పల్లవి

ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగా పరమ తండ్రి కౌగిలించును స్వరమునెత్తి ప్రార్ధించగా మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన||

1వ చరణం

తండ్రి అని నే పిలువగా తనయుడా అని తా బల్కును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయున్ మోకరించి ప్రార్ధించగా సమీపముగా వేంచేయును మనవులెల్ల మన్నించును మహిమతో నలంకారించును కుటుంబముతో ప్రార్ధించగా కొదువ ఏమియు లేకుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము అచటుండును సంఘముగను ప్రార్ధించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మ వరములతో నింపును ఉపవాసముతో ప్రార్ధించగా కీడులన్నియు తొలగిపోవును కొట్లు ధాన్యముతో నింపును క్రొత్త పానము త్రాగించును ఏకాంతముగా ప్రార్ధించగా నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యము నను చేర్చును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.