TG-4105
Telugu

ప్రార్ధన యేసుని

Praardhana Yesuni

0
views
పల్లవి

ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగా పరమ తండ్రి కౌగిలించును స్వరమునెత్తి ప్రార్ధించగా మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన||

1వ చరణం

తండ్రి అని నే పిలువగా తనయుడా అని తా బల్కును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన||

2వ చరణం

మోకరించి ప్రార్ధించగా సమీపముగా వేంచేయును మనవులెల్ల మన్నించును మహిమతో నలంకారించును ||ప్రార్ధన||

3వ చరణం

కుటుంబముతో ప్రార్ధించగా కొదువ ఏమియు లేకుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన||

4వ చరణం

సంఘముగను ప్రార్ధించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన||

5వ చరణం

ఉపవాసముతో ప్రార్ధించగా కీడులన్నియు తొలగిపోవును కొట్లు ధాన్యముతో నింపును క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన||

6వ చరణం

ఏకాంతముగా ప్రార్ధించగా నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||