ప్రార్థించుము
Praardhinchumu
ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు (2) సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము||
యెడతెగక నీవు ప్రార్థించినా విసుగక నీవు ప్రార్థించినా (2) సమస్తమును నీవు పొందెదవు తప్పక న్యాయము పొందెదవు (2) నీ కొరకై ప్రభు వేచియున్నాడు ప్రార్థనలో కనిపెట్టుము (2) ||ప్రార్థించుము||
కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను (2) సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను (2) భయపడకుము ప్రభువే నీకు జయము నిచ్చును (2) ||ప్రార్థించుము||
ప్రభువే మనతో సెలవిచ్చెను మెళకువగా నుండి ప్రార్థించుమని (2) విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా (2) సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందెదవు (2) ||ప్రార్థించుము||
ప్రభువచ్చు వేళాయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో (2) ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో (2) పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెళకువగా నుండుడి (2) ||ప్రార్థించుము||
యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై (2) భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును (2) వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును (2) ||ప్రార్థించుము||