♪♫
TG-4107
Telugu
రార్థన వినెడి పావనుడా
Praarthana Vinedi Paavanudaa
18
views
పల్లవి
ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||
1వ చరణం
శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
2వ చరణం
పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
3వ చరణం
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
4వ చరణం
శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.