ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని
prabalamuganee prasthuthincheda prabhuni krupalanni
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్రబలముగనే ప్రస్తుతించెద||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.