TG-4110
Telugu

ప్రభు సన్నిధిలో ఆనందమే

Prabhu Sannidhilo Aanandame

0
views
పల్లవి

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు||

1వ చరణం

ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు||

2వ చరణం

దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు||