ప్రభు సేవ కిదియే సమయంబు ప్రజల విమల ఫలముల నొంద నిదియే సమయంబు ||ప్రభు సేవ||
మరణంబు బడయక మున్నే ఘోర తరమైన పాపాత్ము లరసి గుణ పడఁగ నరక వేదనఁ బాపు కొరకు దేవుఁ డరిమురి తరి యెంతో కరుణతో నొసఁగెఁ ||ప్రభు సేవ||
కరుణ గల్గెడి దివసములలో నీవు పరమ భాగ్యంబులు బడయుంగ వచ్చు మరణం బెరిఁగిన జీవాత్మ యద్ది మఱచెదవి ది యెంతో అరుదై యున్నది ||ప్రభు సేవ||
పశ్చాత్తాపం బనెడి తలుపు మూయఁ బడుమ దేవుని కరుణా భాగ్య మను తలుపు నిశ్చయమంబుగ వేయఁబడు నెంతో యాశ్చర్యకరమౌ నవన మగుపడదు ||ప్రభు సేవ||
సారస్యమైన కార్యములం జేయ సమయ మనెడి తలుపు సరగ మూయబడున్ వారక మృతి బొందునపుడే గాక సార కార్యము లన్ని జక్కఁగాఁ జేయు ||ప్రభు సేవ||
గత దినంబులకై స్తుతింతున్ మిగుల కఠినంబులైనట్టి గండముల నుండి ప్రతి దినంబును దప్పించుచు నెంతో మితిలేని కృపచేత బ్రతికించు మనలఁ ||ప్రభు సేవ||
నీతియుతులగు భక్తులారా మన పాతకములకుఁ జచ్చి పరమేశ్వరుని ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము నూత్న వత్సరము ప్రభు స్తుతికై బ్రతుకుదుము ||ప్రభు సేవ||