ప్రభు యేసు నా రక్షకా
prabhu yeesu naa rakssakaa
ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే – ఒమేగయు నీవే ||ప్రభు యేసు||
ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.