TG-675
Telugu

ప్రభు యేసుని వదనములో నా

prabhu yeesuni vadanamuloo naa

203
views
పల్లవి

ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం

1వ చరణం

దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు ||ప్రభు యేసుని||

2వ చరణం

యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు యేసుని||

3వ చరణం

పరదైనున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే(2) పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు యేసుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.