ప్రభు యేసు ప్రభు యేసు
Prabhu Yesu Prabhu Yesu
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో ||ప్రభు యేసు||
ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా అంతగా బాధించి సిలువమీది కెత్తిరి బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||
ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||
ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||
మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను మూడవనాడు సమాధినుండి లేచెను విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||
తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు దేవయని ప్రభు అరచిన యపుడు దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభుయేసు||
కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని నీకువేరుగా నారక్షణిల లేదుగా నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||