♪♫
TG-4113
Telugu
ప్రభు యేసుని పూజించెద
Prabhu Yesuni Poojinchedam
0
views
పల్లవి
ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు||
1వ చరణం
జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు (2) మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా||
2వ చరణం
ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి (2) ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||