TG-4116
Telugu

ప్రభుని రాకడ

Prabhuni Raakada

0
views
పల్లవి

ప్రభుని రాకడ – ఈ దినమే పరుగులిడి రండి – సుదినమే (2) పరమునందుండి – మన ప్రభువు ధరకు నరుగును – పాలనకై (2) బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని||

1వ చరణం

సిద్ధులగు వారిన్ – మన యేసు శుద్ధి జేయునిలన్ – పరమునకై (2) బుద్ధిహీనులను – శ్రమలచేత బద్ధులుగ జేయున్ – వేదనతో (2) బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని||

2వ చరణం

స్వరముతో వచ్చున్ – అధికారి మహిమతో మరలున్ – తన దూత (2) సూర్యచంద్రునిలన్ – తారలతో జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2) పగలు రాత్రియగున్ – త్వరపడుము ||ప్రభుని||

3వ చరణం

మొదట లేతురు – సజీవులై ప్రభునియందుండు – ఆ మృతులు (2) మరల అందరము – ఆ ధ్వనితో పరము జేరుదుము – ధరనుండి (2) ధన్యులగుదుము – పరికించు ||ప్రభుని||

4వ చరణం

వెయ్యియేండ్లు – పాలించెదరు ప్రియుని రాజ్యమున – ప్రియులు (2) సాయం సమయమున – చేరి నెమలి కోకిలలు – రాజున్ (2) పాడి స్తుతించును – ఆ దినము ||ప్రభుని||

5వ చరణం

గొర్రె మేకలును – ఆ చిరుత సింహజాతులును – ఒక చోట (2) భేధము లేక – బరుండి గరిక మేయును – ఆ వేళ (2) కలసి మెలగును – భయపడక ||ప్రభుని||

6వ చరణం

న్యాయ నీతులన్ – మన ప్రభువు ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2) సాక్షులుగ నిలుతుం – అందరము స్వామియేసునకు – ధ్వజమెత్తి (2) చాటి యేసునకు – ఓ ప్రియుడా ||ప్రభుని||