TG-5501
Telugu

ప్రభువా అని ప్రార్థిస్తే చాలునా దేవా అని ఆర్థిస్తే సరిపోవునా

Prabhuvaa Ani Praarthisthee Chaalunaa Deevaa Ani Aarthisthee Saripoovunaa

20
views
పల్లవి

ప్రభువా! అని ప్రార్థిస్తే చాలునా దేవా అని ఆర్థిస్తే సరిపోవునా మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినా బ్రతుకు బాగుపడకుండా - కన్నీళ్ళు కార్చినా ప్రభుని క్షమను పొందగలమా - దీవెనల నొందగలమా? ఆలోచించుమా ఓ నేస్తమా - ఆలోచించుమా ప్రియ సంఘమా పైకి భక్తి ఎంత ఉన్న - లోన శక్తి లేకున్న కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న సుఖ సౌఖ్యమునొందగలమా - సౌభాగ్యము పొందగలమా ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా మాటతీరు మారకుండా - మనుష్యులను మార్చతరమార నోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నా ప్రభు రాజ్యం చేరగలమా - ఆ మహిమను చూడగలమా ఆలోచించుమా ఓ సేవకా! - ఆలోచించుమా ప్రియ బోధకా!

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.