TG-610
Telugu

ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ

prabhuvaa mammunudeevinchi panpumu nee

205
views
పల్లవి

ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా మమ్మునుదీవించి||

1వ చరణం

పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా మమ్మునుదీవించి||

2వ చరణం

గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా మమ్మునుదీవించి||

3వ చరణం

క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా మమ్మునుదీవించి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.