ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
prabhuvaa nee kaluvari thyaagamu - chuupenee nee paripuurnnathanu
🎵 TG-1146🌐 Telugu
పల్లవి
ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే ||ప్రభువా||
1వ చరణం
నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి (2) లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే (2) ||ప్రభువా||
2వ చరణం
జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే (2) శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే (2) ||ప్రభువా||
3వ చరణం
సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే (2) పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే (2) ||ప్రభువా||